Pawan Kalyan Bro Movie: బ్రో సినిమా విషయంలో జగన్ సర్కార్ ఏం చేస్తుందో.. పవన్ ఫ్యాన్స్ టెన్షన్ ఇదే!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ చూసుకోబోతున్న విషయం తెలిసిందే.

 Ap Government Pawan Kalyan Movie Bro Ticket Rates-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా పాల్గొంటున్నారు.మామూలుగా హీరోల జీవితాలు రాజకీయాలతో ముడిపడినప్పుడు కచ్చితంగా సినిమాలపై రాజకీయ ప్రభావం ఉంటుంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ గత సినిమాలు అయినా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలపై రాజకీయ ప్రభావం పడిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ రెండు సినిమాల సమయంలో ఏకంగా రెవిన్యూ అధికారులను థియేటర్ల వద్ద కాపలా ఉంచేలా చేసింది.

కేవలం పది రూపాయలకు టికెట్లు అమ్మేలా బీసీ సెంటర్ల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చింది.తర్వాత వచ్చిన ఏ కొత్త రిలీజుకు ఇలాంటి ట్రీట్ మెంట్ జరగలేదు, చూడలేదు.

ప్రస్తుతం వారాహి యాత్రలో( Varahi Yatra ) పవన్ వాడివేడిగా వైసీపీ మీద విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు పవన్.ఏకంగా కుల నాయకులతో లెటర్లు రాయించేదాకా చక్రం తిప్పారు.

ఇక మంత్రులు ఎమ్మెల్యేల మాటల దాడులు యథాతథం.ఇంఇకపోతే పవన్ నటించిన బ్రో సినిమా( Bro Movie ) మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది.

వినోదయ సితం రీమేక్ గా రూపొందుతున్నప్పటికీ అంచనాలు భారీగానే ఉన్నాయి.గతంలోలా హఠాత్తుగా టికెట్ రేట్ల జిఓలు, గవర్నమెంట్ ఆఫీసర్ల చెకప్పులు ఉంటాయేమోనని ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు.

నిజానికి ఈసారి వ్యవహారం అంత తేలికగా ఉండదు.

Telugu Ap, Bheemla Nayak, Bro, Cmjagan, Pawan Kalyan, Sai Dharam Tej, Tickets Ra

ఒకవేళ ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేస్తే జనానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రభుత్వ చర్య సులభంగా అర్థమైపోతుంది.ఈ పోకడని పవన్ ఇంకో ఆయుధంగా వాడుకుని ఎన్నికల ప్రచారంలో పబ్లిక్ కి చేరవేస్తాడు.ఇదొక్కటే కాదు డిసెంబర్ లేదా జనవరిలో ఓజి ( OG Movie ) విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

దాన్ని కూడా నియంత్రించాలని చూస్తే ఏ హీరోకి లేని నిబంధనలను తనకు మాత్రమే ఎందుకు వస్తున్నాయని పవన్ పదే పదే ప్రశ్నిస్తే దానికి సమాధానం అంత సులభంగా రాదు.

Telugu Ap, Bheemla Nayak, Bro, Cmjagan, Pawan Kalyan, Sai Dharam Tej, Tickets Ra

భీమ్లా నాయక్ వచ్చే నాటికి వైసిపి పాలన సగమే అయ్యింది.అందుకే ఏం చేసినా చెల్లింది.ఇప్పుడు తొమ్మిది పది నెలల్లో ఎలక్షన్లను పెట్టుకుని కావాలని పవన్ కళ్యాణ్ సినిమాలను టార్గెట్ చేసుకుంటే థియేటర్లకు వెళ్లని జనాలకు కూడా ఈ ప్రతీకార చర్య వెనుక ఉద్దేశం అర్థమైపోతుంది.

అందుకే బ్రో, ఓజిల విషయంలో మరీ తీవ్రంగా అడుగులు వేయకపోవచ్చు.ఏపీ సర్కారు చేసిన పనులవల్ల నేను నిర్మాతలకు ముప్పై కోట్లకు వెనక్కు ఇచ్చానని చెప్పిన పవన్ కు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైతే ఇంకా బలంగా తీసుకెళ్తాడు.

అందుకే వైసిపి నుంచి టికెట్ కంట్రోలింగ్ కంటే డ్యామేజ్ కంట్రోలింగే ఉండొచ్చు మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube