మనకు చేసిన దోషాలు తొలగించుకోవడానికి వినాయకుణ్ణి పూజించటం మంచిదని చాలా మంది చెబుతుంటారు.అవును.
అది నిజమే.మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే వినాయకుని పూజ చేయాల్సిందే.
ఇప్పుడు .గణపతిని ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుంది, మనకు కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం.
* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి
* చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి
* కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది
* బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి
* గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి
* శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి
* శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి
* రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది
* కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి
* ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు
* పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి
* పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది
* మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి
* స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.