*ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే పేద ప్రజలకు పంచిపెడతాం:నూనె వెంకట్ స్వామి.

నల్లగొండ జిల్లా:అధికార పార్టీ అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు,రాజకీయ పార్టీల నేతలు అక్రమంగా ప్రభుత్వ,చెర్వుశిఖం భూములను దురాక్రమణ చేస్తే, పేద ప్రజల సమూహాలతో పోరాడి,వాటిని పేదలకే స్వాధీనం చేస్తామని ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్)రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.మంగళవారం ముప్పిడి మారయ్య అధ్యక్షతన నార్కట్‌పల్లిలో జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ,చెరువుశిఖం భూములను ఎవరు అక్రమించినా ఉపేక్షించేది లేదని,అలాంటి వాటిపైన ప్రజా పోరాటాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని,పేదలకు పంచుతామని హెచ్చరించారు.

 * Occupy Government Lands And Distribute To Poor People: Noone Venkat Swamy.-TeluguStop.com

ప్రభుత్వ భూములను కలిపి నాలా అనుమతులు ఇచ్చే తహసిల్దార్లను సస్పెండ్ చేయాలని,అక్రమణలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.బ్రాహ్మణ వెల్లెంల,ఉదయసముద్రం ప్రాజెక్టులకు తక్షణం 100 కోట్లు కేటాయించాలని,ఆటో డ్రైవర్లపై వేసే అధిక పెనాల్టీలను రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.

ముందుగా ఇటీవల అగ్నిపథ్ కాల్పులకు గురై మరణించినవారికి, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో పోలగోని సైదులు గౌడ్,కందాల మహేందర్ రెడ్డి, అర్రూరి ప్రవీణ్,రేకల రవి,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్, విజయ్,బండారు షన్ముఖ,నాగటి పరమేశ్,నూనె శ్రీకాంత్,మహేశ్వరం అంజి,రుద్రాక్షి రాందాసు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube