నల్గొండ జిల్లా: మిర్యాలగూడలోని నూకల వెంకట ఛారిటబుల్ ఆసుపత్రిలో మెడికల్ షాప్ అనుమతి కోసం చిట్టెపు సైదిరెడ్డి నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించగా,డ్రగ్ ఇన్స్పెక్టర్ పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఇరవై వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సోమవారం బాధితుని వద్ద పద్దెనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆఫీసులో రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి సోమశేఖర్ ను పట్టుకున్నారు.