నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ( General Elections )వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.రెండు నెలల్లో రూ.
లక్షకు మించి జమ,విత్ డ్రా చేసిన ఖాతాలు,ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది.రూ.లక్షకు మించి జమ, డిపాజిట్ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల,పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది.
రూ.10 లక్షల జమ,డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు( District Election Officers ) సమాచారం తెప్పించుకోవాలని,అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఇవ్వాలని తెలిపింది