రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్( Congress ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా తెలంగాణలో 6 నుంచి 8 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.నిజామాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.
అలాగే వరంగల్, ఖమ్మం, మెదక్, సికింద్రాబాద్, భువనగిరి స్థానాలు పెండింగ్ లో ఉండనున్నాయి.కాగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ( Gaddam Vamsi ), మల్కాజ్ గిరి అభ్యర్థిగా సునీతా రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్ రెడ్డి,( Ranjith Reddy ) ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత/ నరేశ్ జాదవ్/ ఆత్రం సుగుణ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్, నాగర్ కర్నూల్ అభ్యర్థిగా మల్లు రవి, నిజామాబాద్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి,వరంగల్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య/ పసునూరి దయాకర్, భువనగిరి అభ్యర్థిగా చామల కిరణ్ రెడ్డి / కోమటిరెడ్డి లక్ష్మీ, మెదక్ అభ్యర్థిగా నీలం మధు పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.