జై బోరన్న పిల్లలకు కులం,మతం లేదని సర్టిఫికెట్...!

నల్లగొండ జిల్లా: కమ్యూనిస్టు విప్లవకారుడు,జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత, ప్రజా బంధువుగా పిలవబడే కామ్రేడ్ జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం తమకు ఇకపై ఏ కులంతో గాని,ఏ మతంతో గాని సంబంధం లేదని పేర్కొంటూ నో క్యాస్ట్,నో రిలీజియన్ సర్టిఫికెట్ తీసుకొని,సామాజిక మార్పును కాంక్షించే ప్రజాతంత్ర శక్తులకు జెఎస్ఆర్ ఆదర్శంగా నిలిచారని ప్రజా చైతన్య సంఘం ప్రెసిడెంట్ సిహెచ్.శోభారాణి ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ సుభాషన్నను అభినందించారు.

 Jai Borannas Children Have No Caste Or Religion Certificate, Jai Borannagari Sub-TeluguStop.com

గత మూడు దశాబ్దాలుగా నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ నిర్మాణానికి తనవంతుగా కృషి చేస్తున్న ఆదర్శ విప్లవకారుడు జై బోరన్న గారి నేతాజీ సుభాషన్న తనకు గాని, తన పిల్లలైన కూతురు జెఎస్ఆర్ ఝాన్సీలక్ష్మీబాయి,పెద్ద కొడుకు జేవిఆర్ మహాత్మా గాంధీజీ,చిన్న కొడుకు జెజెఆర్ సర్దార్ పటేల్ కు ఏ కులం,ఏ మతంతో సంబంధం లేదని పేర్కొంటూ నో క్యాస్ట్,నో రిలీజియన్’ సర్టిఫికెట్ తీసుకొని కులం,మతం ప్రస్తావనలేని సమాజం కావాలని కలలుగంటున్న తనలాంటి ఎందరో సామాజిక కార్యకర్తలకు సుభాషన్న జీవితం ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆమె ప్రజా బంధువు సుభాషన్నను ప్రశంసించారు.బీసీ (డీ) యాదవ సామాజిక వర్గానికి చెందిన సుభాషన్న తనకు తన పిల్లలకు ఏ కులం లేదని సర్టిఫికెట్ తీసుకుంటే రిజర్వేషన్లు,ఇతర ప్రభుత్వ సదుపాయాలు అందవని తెలిసినప్పటికీ,తన పిల్లలకు నిరంతరం కులం కంటే గుణం గొప్పదని, మతం కంటే మానవత్వం మంచిదని చాటిచెప్పే జెఎస్ఆర్ నేతాజీ సమాజంలో మార్పు కోరుకునే ప్రజాతంత్ర ఉద్యమకారుడుగా ప్రేమ,సమానత్వం నేర్పించాలని భావించిన పీడిత ప్రజల శ్రేయోభిలాషి ప్రజా నేస్తం కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఇష్టపడలేదని కుల నిర్మూలన చైతన్య సంఘం అధ్యక్షుడు తోట మల్లికార్జునరావు తెలిపారు.

బాల్యం నుండి ప్రగతిశీల ప్రజాతంత్ర విప్లవ భావాలు కలిగిన సుభాషన్న జీవితం అనేక కష్టనష్టాలను చవిచూసిందని,పశువుల కాసే కాపరిగా,గొర్రెల మేకల కాపరిగా మొదలైందని,9 సంవత్సరాల చిన్న వయసులోనే వ్యవసాయంలో నష్టాలపాలై కన్నతల్లి బోర లక్ష్మమ్మ యాదవ్ ఆత్మహత్య చేసుకుంటే, అనాధగా మారినప్పుడు తన అమ్మమ్మ,తాత అయిన సూర్యాపేట జిల్లా ఏపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన మున్న గంగక్క,మున్న లింగన్న యాదవ్ మేనమామలు మున్నా శ్రీరాములు మున్నా లింగమలు మున్నా గురవయ్యలు,అమరుడు మున్నా ఆంజనేయులు యాదవ్ మరియు మున్నా సైదులు యాదవ్, మట్టపల్లి గంగన్న యాదవ్, చిన్నమ్మ ఏర్పుల ఐలమ్మ యాదవ్,బాబాయ్ ఏర్పుల చంద్రన్న యాదవ్,మరో చిన్నమ్మ అమరజీవి వీరబోయిన ముత్తమ్మ యాదవ్ బాబాయ్ వీరబోయిన లింగమల్లు యాదవ్ చేరదీసి,సర్కారు బడికి పంపారని,సెలవు దినాల్లో వ్యవసాయ కూలీలతో కలసి అనేక రకాల వ్యవసాయ పనులు చేశాడని పేర్కొన్నారు.బాల్యమంతా కష్టాల కన్నీటి మయమని,బాల కార్మికుడిగా,గొర్రెల మేకల కాపరిగా,పశువుల కాపరిగా,ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికుడిగా, సుభాషన్న తన జీవితంలో సకల సమస్యలను ఎదుర్కొనడం మూలంగానే ప్రజల బాధల పరిష్కారానికి కమ్యూనిజమే సరైన మార్గమని కమ్యూనిస్టు విప్లవకారుడుగా పదహారేళ్ళ వయసులోనే పూర్తికాల విప్లవ కార్యకర్తగా మారాడని పేర్కొన్నారు.

సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలకు నిలయాలుగా మారినప్పుడు పురుగులున్న అన్నం మాకొద్దు,నీళ్ల చారు మాకొద్దు అంటూ అనేక హాస్టల్లో విద్యార్థులను కూడదీసి విద్యార్థుల హక్కుల కోసం అనేక సంవత్సరాలు విప్లవ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలు నిర్వహించిన ఘనత సుభాషన్నకు దక్కుతుందని ఆమె తెలిపారు.దోపిడీ, అసమానతలు,పీడనలు కుల వివక్షత, అంటరానితనం సకలం సామాజిక జీవన సమస్యలకు పరిష్కార మార్గం నాటి నక్సల్పరి సాయుధ పోరాట మార్గమే సరైన దారి అని విప్లవాల బాటలో నడుస్తూ పిడియస్ యు రాష్ట్ర అధ్యక్షుడు నుండి మొదలుకొని నేటి సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి వరకు పీడిత ప్రజల విముక్తి కోసం జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ ప్రజా పోరాటాలలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడని శోభారాణి కొనియాడారు.

కులాన్ని అంగీకరించడం అంటే అన్యాయాన్ని అసమానత్వాన్ని అంగీకరించడమేనని అనుదినం పేర్కొనే అభ్యుదయ వాది సుభాషన్న కుల నిర్మూలన చైతన్యంలో భాగంగా ఇప్పటికే వందల వ్యాసాలు,రచనలు చేశాడని,నేడు కులం మతం లేని ఆదర్శ భారతీయుడుగా సర్టిఫికెట్ పొందడం ద్వారా మాలాంటి ప్రజా ఉద్యమ కార్యకర్తలకు సుభాషన్న జీవితం కరదీపికగా వెలుగునిస్తుందని అమె పేర్కొన్నారు.ప్రజా ఉద్యమాలే ప్రాణంగా పీడిత ప్రజల విముక్తి తన జీవిత లక్ష్యంగా ఆశయాలకు ఆదర్శాలకు తనదైన అడ్రస్ ను కలిగిన అభ్యుదయ వాది జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సుభాషన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో పేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టినప్పుడు అమ్మమ్మ తాతలు మున్నా గంగమ్మ లింగయ్య యాదవ్ లూ అప్పటికే కుక్క కాటు మూలంగా చనిపోయిన తమ కొడుకు పేరునూ మల్లన్న స్వామి,అని మొదట పేరునూ అమ్మమ్మ తాతలు ఎంతో ముద్దుగా పెట్టుకున్నారని

తర్వాత కొంతకాలానికి కన్నతల్లి బోరా లక్ష్మీ యాదవ్ ఆరోగ్యం బాగా లేకపోతే జానపాడు సైదన్నకు మొక్కుకొని సైదయ్యగా పేరును మార్చారనీ తెలిపారు.

విద్యార్థి ఉద్యమ కార్యకర్తగా,నాయకుడిగా జీవిత ప్రస్థానం మొదలుపెట్టిన ప్రజాతంత్ర ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న దేహం కంటే దేశం గొప్పదని,దేవుళ్ళు దయ్యాల కంటే దేశభక్తులే తన హీరోలని చాటిచెప్పుతూ తన పేరునుండి దేవుళ్ళను దయ్యాలను సూచించే చిన్నప్పటి మల్లన్న స్వామి నుండి మొదలు సైదయ్య యాదవ్ ల వరకు పూర్తిగా అధికారికంగా కులం తోకలను,దేవుళ్ళ గుర్తింపు లను రద్దు చేసుకొని 1996వ సంవత్సరం జనవరి 18వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పరిచయం అక్కరలేని ప్రపంచ భరత జాతి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత మహనీయుడి ఆశయాలతో, ఆలోచనలతో ప్రభావితుడై తన పేరును సుభాష్ చంద్రబోస్ గా తన 18 సంవత్సరాల వయసులో తనకు తానుగా మార్చుకొని శాస్త్రీయ పరివర్తన చెందాడని ఆమె అన్నారు.బహుశా ఒక వ్యక్తి తన పేరును తానే పెట్టుకోవడం లక్షల్లో, కోట్లలో ఏ ఒక్కరికో ఆ అదృష్టం దక్కుతుందని ప్రజా నేస్తం జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆమె అభినందించారు.

ప్రజా బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన పిల్లలకు సైతం ఝాన్సీ లక్ష్మీబాయి,మహాత్మా గాంధీజీ,సర్దార్ పటేల్ లాంటి మహనీయుల పేర్లను పెట్టి దేవుళ్ళు దయ్యాలు తనకు ఆదర్శం కాదని మరోసారి చాటి చెప్పాడని,దేశం కోసం స్వేచ్ఛ స్వతంత్ర కోసం ప్రాణ త్యాగాలు చేసిన దేశభక్తులు,అమరజీవులే తనకు ఆదర్శమని సుభాషన్న నిరూపించారని సుభాషన్న యొక్క ఆచరణాత్మక,ఆదర్శ విలువలను ప్రజా ఉద్యమకారుని శోభారాణి ప్రశంసించారు.అంతేకాకుండా ఇటీవల కాలంలో 85 సంవత్సరాల వయసు కలిగిన తన తండ్రి గారైన బోరా చంద్రన్న యాదవ్ పేరు నుండి కులం తోకను కత్తిరించి,దేవుడి తోకను తిరస్కరించి తన తండ్రి పేరును ఇకపై అధికారికంగా చంద్రశేఖర ఆజాద్ రాజా బాపూజీగా మార్చిన ఘనత భారతదేశం మొత్తంలో 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధ తండ్రికి నూతన పేరును పెట్టిన వీరుడుగా జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చరిత్రలో స్థానం దక్కుతుందని అభినందించారు.

అట్లాగే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం వ్యవసాయ రంగ సంక్షోభంలో నలిగిపోయి మానసికంగా కృంగిపోయి చనిపోయిన బోరా లక్ష్మీ యాదవ్ తన తల్లి పేరును జై బోరన్న గారి ఝాన్సీ లక్ష్మీబాయిగా మార్చాడని తెలిపారు.తన తల్లి రియల్ ఫోటోలు లేకపోవడం వల్ల దేశభక్తురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి గారిని తన తల్లిగా భావిస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి ఫోటోకి దండం పెడుతూ సుభాషన్న ప్రతి రోజు తన దినచర్యను ప్రారంభిస్తాడని ప్రజా ఉద్యమకారిని శోభారాణి పేర్కొన్నారు.

పేద కుటుబంలో పుట్టి యావత్ అణగారిన జాతుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పాటుపడుతున్న విప్లవకెరటం,పేద ప్రజల చీకటి జీవితాల్లో వెలుగు నింపడం కోసం వేగు చుక్కవలె వెలుగులు నింపాలని నూతన ప్రజాస్వామ్య విప్లవ సమాజ నిర్మాణానికి తన వంతుగా పోరాడుతున్న బహుజన వెలుగురేఖ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు.అభాగ్యుల పాలిట వరం!దళిత, పీడిత జనోద్ధరణ కోసం నిరంతరం పరితపిస్తున్న అకుంటిత సమరం !! సాంఘీక దురాచారాలపై ఎలుగెత్తిన రణ నినాదం !!! పీడిత తాడిత వర్గాలను జాగృతం చేయడం కోసం పూర్తికాల విప్లవకారుడుగా మారిన ప్రజాతంత్ర పోరాట యోధుడు,బడుగు జనుల వైతాళికుడు,బాధితుల బంధువు కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1996 జనవరి 18వ తేదీన బోరా సుభాష్ చంద్రబోస్ పేరుతో ఆనాటి వార్త పేపర్లో రాసిన ఒక వ్యాసంలో చెప్పినట్లుగా…తెల్లోడికి నీడ నలిపే,నల్లోడికి నీడ నలుపే,వర్ణాల్లో లేదు జీవితం,మనిషి ఆలోచనలోనే ఉంది మంచి,చెడు అనే జీవితం అని పేర్కొన్నారు.

తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సంతృప్తికరంగా పనిచేయకపోతే కొత్త వారిని తిరిగి ఎన్నుకొనే హక్కు ప్రజలకు కల్పించాలని,పాత వారికి ఉద్వాసన పలికి కొత్త వారిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉండాలని, కులాన్ని రద్దుచేస్తూ భారత పార్లమెంట్ లో చట్టం చేయాలని,భూమిని, కంపెనీలను ప్రవేట్ ఆస్తి నుండి తప్పించాలని, సకల సమస్యలకు నేరాలు-ఘోరాలు పెరిగి పోవడానికి కారణం అవుతున్న దేశంలోని ఉన్న యావత్ భూమిని తక్షణమే జాతీయం చేయాలని డిమాండ్ చేస్తున్న,తన శక్తి మేరకు పోరాడుతున్న ప్రజాతంత్ర ఉద్యమకారుడు జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనలు,ఆశయాలు ఆచరణలోకీ మాత్రం రావడం లేదనీ ఆమె బాధపడుతూ,ఇకనైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన ఒత్తిడి పెంచుతూ భారత పార్లమెంట్లో కులాన్ని రద్దు చేస్తూ చట్టం చేయడమే కాకుండా, భూమిని ప్రైవేట్ ఆస్తి నుండి తప్పించి జాతీయం చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి,యువజనులు పేద ప్రజలు,సమాజ మార్పును కోరుకునే దేశభక్తులు సమరశీల పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

మహా తాపసి,నిశ్శబ్ద విప్లవకారుడు, మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు రూపం,సముద్రమంత మనిషి,పర్వతాలకు ఉన్నంత సహనం ఉన్న మనిషి,నదిలా నిరంతరం ప్రవహించే మనిషి, మనుషుల మధ్య కుల, మత అసమానతలు, ఆర్థిక,సామాజిక వివక్షలు లేని సమాజాన్ని కోరుకున్న మనీషి మనుషులందరిది ఒకే కులం -ఒకే మతంగా ఉండాలని బాల్యం నుండే నిరంతరం తపిస్తూ నూతన ప్రజాస్వామ్య విప్లవ సమాజాన్ని కలలుగంటూ కమ్యూనిస్టు విప్లవకారుడిగా మారి అదే లక్ష్యంగా సమసమాజాన్ని స్వప్నించి తన జీవితంను కమ్యూనిస్టు విప్లవ సమాజ నిర్మాణానికి ఆదర్శాలకు,కులం మతం లేని సమసమాజ స్థాపనకోసం జరిగే ప్రజా పోరాటాలకు,ప్రజాతంత్ర ఉద్యమాలకు అంకితం చేసి,మూడు దశాబ్దాల ఉద్యమ చరిత్రలో ఒక అంగుళం కూడా అటూ ఇటూ వైదొలగకుండా,ఏ బూర్జువా పార్టీల్లో చేరకుండా,భూస్వామ్య ధనస్వామ్య హిజుకి పెట్టుబడిదారు వర్గాల దోపిడీ పీడనలను మోసాలను నిత్యం ఎండగాడుతూ,తనవంతు పీడిత ప్రజలను చైతన్యపు దారులలో నడిపించడానికి ప్రయత్నిస్తూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ తనలోనూ,తన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని దర్శించిన అరుదైన అపురూపమైన మహాముని,యోగి,త్యాగి, మహానీయుడు జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రాజా నేతాజీ జెఎస్ఆర్ సార్ ఆలోచన విధానాన్ని నేటి యువతరం కొంతనైనా స్వీకరించాలని ప్రజా చైతన్య సంఘం కోరుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube