నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్‌కి తక్షణమే నీటి విడుదల ఆపివేయాలని కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ ఏపి ప్రభుత్వనికి ఆదేశాలు జారీ చేసింది.నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది.
ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని కేఆర్ఎంబీ ప్రశ్నించింది.అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఐదు టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు ఏప్రిల్ 8 నుంచి 24 వరకు ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి.
ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని,కానీ,ఏపీ పరిమితికి మించి ఎక్కువ జలాలను వాడుకుంటోందని కేఆర్ఎంబి తెలిపింది.
ఈ నేపథ్యంలో కాల్వల ద్వారా నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.