నల్లగొండ జిల్లా:మునుగోడులో జరిగిన ధర్మ యుద్ధంలో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని,బీజేపీ విజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు గులాబీ కండువాలు లేని టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
బహిరంగంగా టీఆర్ఎస్ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు.స్థానికేతరులను,డబ్బు పంచుతున్న వారిని బీజేపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పచెబితే వారిని వదిలిపెట్టి,బీజేపీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జ్ లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు.
లాఠీచార్జ్ చేసినంత మాత్రానా బీజేపీ కార్యకర్తలు భయపడతారని అనుకుంటే పొరపాటున్నారు.మునుగోడులో అక్రమంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని, అయినా అధర్మం గెలవదని,ధర్మ యుద్ధంలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటేసిన ఓటరు దేవుళ్ళకు,నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ పూర్తయ్యేంతవరకు అప్రమత్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.