నల్లగొండ జిల్లా
:ఏ తల్లికైనా కాన్పు అన్నది అక్షరాలా పునర్జన్మేననీ,అమ్మ జీవితంలోని అత్యంత కీలక ఘట్టమే కేంద్ర బిందువుగా అమానవీయ వ్యాపార ధోరణులు ముమ్మరించడం, ఆలోచనాపరులెవరికైనా బాధ కలగక తప్పదని, కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, ప్రజా బంధువు,కామ్రేడ్ జై బోరన్న( Comrade Jai Boranna ) గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్( Netaji Subhash Chandra Bose ) తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో ఒకప్పుడు పురుడు పోసుకోవడం అంటే అర్థం-సాధారణ సుఖప్రసవం.
శస్త్ర చికిత్స మాట అరుదుగానే వినిపించేది.తల్లికి లేదా శిశువుకు ప్రాణాపాయ పరిస్థితి తలెత్తితేనే, సిజేరియన్ చేసేవారు.
సాధారణ ప్రసవం జరిగితే మహిళ ఆరోగ్యానికి ఢాకా ఉండదని.రోజుల వ్యవధిలోనే అన్నిపనులూ చేసుకోగల స్థితికి చేరుకుంటారన్నది వైద్యనిపుణుల సిఫార్సు.
వాస్తవంలో దేశం నలుమూలలా తరతమ భేదాలతో ప్రసవ కోతలు అంతకంతకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10-15 శాతానికి మించకూడదు.కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంక విభాగం నివేదికాంశాల ప్రకారం, ప్రసవాల్లో సిజేరియన్ శస్త్ర చికిత్సల జాతీయ సగటు 23.29 శాతం.ఆ సగటు కన్నా అధికంగా దేశంలోని 22 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రసవ కోతలు జోరుగా సాగుతున్నాయి.
ఆ జాబితాలో తెలంగాణ (54.09 శాతం),ఏపీ (42.15) సైతం ఉన్నాయి.కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కడుపుకోతలనే లెక్కకడితే జాతీయ సగటు (37.95) ను మించిపోయి సి-సెక్షన్ శస్త్రచికిత్సలు సాగుతున్న రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 25గా నమోదైంది.ఒడిశాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు 74 శాతానికి పైబడటంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఆడిటింగ్ నిర్వహిస్తోంది.ఆ శ్రేణిలో 61శాతానికి మించినట్లు పేర్కొన్న పేద ప్రజల అభ్యున్నతి కోరుకునే ప్రజా నేస్తం జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రైవేట్ రంగాన సిజేరియన్ల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా దృష్టి సారించాలని సుభాషన్న డిమాండ్ చేశారు.
అంతకుముందే సి-సెక్షన్ ప్రసవాల్ని కట్టడి చేయాల్సిందిగా సుభాషన్న ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రసవ సమయంలో నొప్పుల్ని తట్టుకోలేరని,నెలలు నిండిన మహిళల కుటుంబ సభ్యులను వైద్యసిబ్బందే భయాందోళనలకు గురిచేసి సిజేరియన్లకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
సాధారణ ప్రసవం కన్నా శస్త్ర చికిత్సలకైతే అధికంగా ఫీజులు దండుకోగల అవకాశం,ఆపరేషన్ అయ్యాక ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావడంవల్ల అదనపు బిల్లులు వడ్డించగల వీలు- ప్రైవేటు వైద్యుల్ని ప్రసవ కోతలకు ప్రేరేపిస్తున్నాయని అన్నారు.ఫలానా రోజున ఏ సమయానికి బిడ్డ తొలిసారి కేర్ మనాలో ముహూర్తం పెట్టించుకుంటున్న కొంతమంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వేలంవెర్రి- సిజేరియన్ల విజృంభణకు మరో ముఖ్యకారణమవుతోందని తెలిపారు.
దురదృష్టం ఏమిటంటే,కాసుల యావ మాటున అనవసర సిజేరియన్ల తాలూకు దుష్ప్రభావాలు మరుగున పడిపోతున్నాయని,వైద్యపరంగా అత్యవసరం కాకపోయినా సిజేరియన్ చేయడమన్నది తల్లికి ప్రమాదకరమని పేర్కొన్నారు.శస్త్రచికిత్స సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఇతర అవయవాలు దెబ్బతినే ముప్పు పొంచి ఉంటుందని,మత్తువల్ల ఊపిరితిత్తులపై ప్రభావం, దీర్ఘకాలంలో ఇన్ఫెక్షన్లు తప్పకపోవచ్చునని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారని, సిజేరియన్ ప్రసవాల్లో జన్మించే శిశువులు అలర్జీలకు,ఇతరత్రా వైద్యపరమైన సమస్యలకు గురయ్యే అవకాశాలు అధికమంటున్న అధ్యయనాలు-తల్లీబిడ్డల ఆరోగ్యానికి తూట్లు పడకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టాలని బాధితుల బంధువు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు పెరిగేలా మౌలిక వసతుల పరిపుష్టీకరణ, జనచేతన కార్యక్రమాల నిర్వహణ చురుకందుకోవాలని,అనవసరంగా సిజేరియన్లు చేపట్టారని నిగ్గుతేలిన పక్షంలో ఆయా వైద్యులు, ఆస్పత్రులపై కఠినచర్యలు అమలుపరచేలా పకడ్బందీ నిబంధనావళిని కేంద్రం,రాష్ట్రాలు సత్వరం క్రోడీకరించాలని కోరారు.
మాతృత్వంతో అడ్డగోలు వ్యాపారం చేస్తున్న దారుణ ఆరాచకానికి తెరదించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ స్టేట్స్ సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 డిమాండ్ చేశారు.