నల్లగొండ జిల్లా:ప్రమాదవశాత్తు పల్లీలు పట్టే మిషన్ ఫ్యాన్ తగిలి బాలుడు తల తెగి మృతి చెందిన విషాద సంఘటన శనివారం దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజీనగర్ గ్రామానికి చెందిన పేట జాన్,రాణి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
శనివారం ఉదయం 8 గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో పల్లీలు పట్టే మిషన్ తెచ్చి పల్లీ చేనును మిషన్ లో వేస్తుండగా అతని రెండవ కుమారుడైన పేట మధు (7) మెడ మీద చున్నీ వేసుకొని పల్లి మిషన్ దగ్గరికి పోయాడు.పల్లీ మిషన్ ఫ్యాన్ నుండి వచ్చే గాలికి మెడపై ఉన్న చున్ని ఫ్యాన్ కు చుట్టుకొని అతని తలకు తగిలి తల కట్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.
తండ్రి పేట జాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొండమల్లేపల్లి ఎస్ఐ నారాయణ రెడ్డి తెలిపారు.