రవాణా శాఖ చెక్‌ పోస్టులకు చెక్ పడ్డట్లేనా...?

నల్లగొండ జిల్లా:అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ( Department of Transport ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు ఎన్నికల కోడ్ ముగియగానే తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా జీఎస్టీ ( GS T)అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రవాణా పర్మిట్లతో సహా వాహనాల అనుమతులు కూడా ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారు.

 Did The Transport Department Check The Check Posts , Transport Department , Gst-TeluguStop.com

ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్‌ పోస్టులు అవసరం లేదని కేంద్రం గతంలోనే సర్క్యులర్‌ జారీ చేసింది.పలు రాష్ట్రాలు ఇప్పటికే వీటిని తొలగించాయి.

తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ సర్కార్ ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు,రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్‌ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో వీటిపై చర్చించి తొలగించేందుకు మొగ్గు చూపారని,ఎన్నికల కోడ్‌ రావడానికి కొద్దిరోజుల ముందు ఉన్నతాధికారులు కూడా చెక్ పోస్టుల తొలగింపుపై తెలంగాణ సర్కార్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

వీటిల్లో రాష్ట్ర వ్యాప్తంగా 150 మందికి పైగా పని చేస్తున్నారు.

ఈ ఉద్యోగులను జిల్లాలు, హైదరాబాద్‌లో వినియోగించుకోవాలని రవాణా శాఖ భావిస్తున్నట్లు వినికిడి.కొద్ది వారాల క్రితం ఓ పొరుగు రాష్ట్రం చెక్‌పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌, ఇతర సేవల సమయంలో రవాణాశాఖ వాహనదారుల నుంచి లైఫ్‌ ట్యాక్స్‌తో పాటు యూజర్‌ ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది.ఏటా ఈ మొత్తం రూ.130 కోట్ల వరకు వస్తున్నట్లు తెలుస్తోంది.రవాణాశాఖకు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భవనాలు సరిగా లేవని,కొత్త భవనాలు, కంప్యూటర్లు వంటి అవసరాలకు నిధులు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల కోడ్‌కి ముందు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు.

యూజర్‌ ఛార్జీల ఆదాయాన్ని కొత్త భవనాలు,మౌలిక సదుపాయాలకు ఉపయోగించుకుంటామని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల కో( Election Code )డ్‌ ముగిశాక అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖకు మొత్తం 15 చెక్‌ పోస్టులున్నాయి.ఇవన్నీరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి.

వాహనాలు,పర్మిట్లను చెక్ పోస్టుల్లో తనిఖీ చేయాలి.అయితే ఇవి అవినీతి కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి.

ఒక్కో చెక్‌పోస్టు దగ్గర పర్మిట్‌ లేని వాహనాల నుంచి నామమాత్రపు జరిమానాలే విధిస్తున్నారు.రాష్ట్రంలోకి వచ్చాక జిల్లాల్లో అంతకు ఎన్నో రెట్లు జరిమానా వసూలవుతున్నట్లు తెలుస్తోంది.

అంటే సరిహద్దుల్లో నిబంధనల అమలు సక్రమంగా జరగడం లేదని,దీనితో వీటి అవసరం కూడా లేదని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube