సిపిఐ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు

నల్లగొండ జిల్లా: సిపిఐ బలపరిచిన నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపుకై సిపిఐ అధ్వర్యంలో దేవరకొండలో దేవరకొండ,నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ హాజరయ్యారు.

 Congress Leaders Who Attended The Cpi General Body Meeting, Congress Leaders , C-TeluguStop.com

ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహా రెడ్డి,జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, భారీగా హాజరైన సీపీఐ నేతలు, కార్యకర్తలను ఆటపాటలతో పల్లె నర్సింహ ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లడుతూ గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిత్రపక్ష పార్టీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పి కొట్టి,ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు అందరూ సిద్దంగా ఉండాలని కోరారు.చరిత్ర తిరగ రాయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా నల్గొండలో కాంగ్రెస్,కమ్యూనిస్టులకే సాధ్యమని కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు.

గత పాలకులు అధికారం అడ్డుపెట్టుకొని వేలకోట్లు సంపాదించిన వైనాన్ని మనమంతా గమనించామని, నేను మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఒక్కసారి అవకాశం కల్పించండి,మీ అందరి నీడగా మీ వెంట ఉంటానని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube