రిజిస్టర్ లో పేరు ఎక్కాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలట...!

నల్లగొండ జిల్లా: పంచాయతీ రిజిస్టర్ లో పేరు నమోదు చేయడానికి రూ.50 లంచం అడిగిన గ్రామ కార్యదర్శి,సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీఓకు ఓ దళిత మహిళా స్వీపర్ ఫిర్యాదు చేసిన ఘటన గురువారం నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది.గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామానికి చెందిన దళిత మహిళ ఒంటెపాక సుగుణమ్మ గత మూడు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఆఫీసులో స్వీపర్ గా పనిచేస్తుంది.

 Dalit Sweeper Complaints To Mpdo In Mailapuram Village,bribe Rs 50000 , Panchaya-TeluguStop.com

మూడు సంవత్సరాలుగా ఆమె పేరు రిజిస్టర్ లో నమోదు చేయకపోగా, మూడేళ్ళ నుండి జీతం కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకొన్నారని బాధిత మహిళ ఆరోపిస్తుంది.కనీసం రిజిస్టర్ పేరైనా నమోదు చేయాలని వేడుకుంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి వెంకట్ రెడ్డి, సర్పంచ్ ఐతరాజు ముత్తమ్మ డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ విషయంపై న్యాయం తనకి న్యాయం చేయాలని గురువారం గుర్రంపోడు ఎంపిడిఓ సుధాకర్ ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube