నల్లగొండ జిల్లా: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాల పడుతున్న దృష్ట్యా వాహనదారులు,ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రయాణ సమయంలో రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపు తప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.
కాబట్టి వాహనాలు అతి వేగంగా నడపవద్దని అన్నారు.వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలని,వాతావరణ తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళకుండా ఉండాలని అన్నారు.
అలాగే ఈదురు గాలులు బాగా వీస్తున్న క్రమంలో వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు వర్షం పడే సమయంలో భారీవృక్షాల కింద నిలపడకూండా ఉండాలన్నారు.అత్యవసర సమయంలో సహాయం కొరకు డయల్ 100 కి కాల్ చేయాలన్నారు.