నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )కు సాగు, తాగునీటితో పాటు జంట నగరాల తాగునీటిని అందించే ప్రధాన జలాశయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు( Nagarjuna Sagar Dam )కు ఎగువ నుండి వరద ప్రవాహం లేకపోవడంతో నీటిమట్టం అడుగంటి కనిష్ట నీటి మట్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది.సాగర్ జలాశయం కనీసం నీటి మట్టం 510 అడుగులు (133 టీఎంసీలు) కాగా,ప్రస్తుతం 519.90 అడుగులు(149 టిఎంసిలు)కు చేరుకుంది.ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు( 312 టీఎంసీలు) వానాకాలం వర్షాలు ఇంకా ఊపందుకోకపోవడం కృష్ణానది పరివాహకంలో భారీ వర్షాలు వరదలు కరువై సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న నారాయణపూర్,ఆల్మట్టి, జూరాల,తుంగభద్ర,శ్రీశైలం ప్రాజెక్టులలో సైతం నీరు కనిష్ట మట్టాలకు పడిపోవడంతో సాగర ప్రాజెక్టు నీటి నిల్వల కోసం వరుణుడిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.సాగర్ ప్రాజెక్ట్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు( Srisailam )లో 808.64 (33.575 టీఎంసీలు) నీటి మట్టం మాత్రమే ఉంది.సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు జంట నగరాల తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నారు.
ఇందుకు కేవలం ప్రస్తుతం కనీసం మట్టానికి పైన పది టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
మునుముందు భారీ వర్షాలు పడి కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి వరదలు వస్తేనే సాగర ప్రాజెక్టు నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది.
అప్పటిదాకా సాగర్ ఆయకట్టు కాలువలకు నీటి విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో వానాకాలం పంటల సాగు సన్నాహాలు ఆలస్యం అవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం వానాకాల పంటల సాగును ముందుకు జరపాలని చెప్పినా,అందుకు సాగర్ కాలువలకు నీటి విడుదల పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టులో పంటల సాగులో జాప్యం అనివార్యమైంది.
వాస్తవానికి సాగర్ ఆయకట్టుకు ఏటా జూన్ 15 నుండి వాన కాలం పంటలకు నీరు ఇవ్వాలని బోర్డు గెజిట్ పేర్కొంది.వర్షాల ఆలస్యంతో ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ లోనే నీటి విడుదల సాగుతుంది.
కృష్ణా నది( Krishna river)కి సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ లలో వరదలు వస్తున్నందున సాగర్ ప్రాజెక్టులో 536 అడుగుల నీటిమట్టం పాటించాలని గతంలో కృష్ణా బోర్డు ఉత్తర్వులిచ్చిందివరదలు వచ్చేవరకు ఈ నీటిని వాడుకోవడం, తదుపరి వరదను సాగుకు విడుదల చేయడం బోర్డు ఉద్దేశమైనప్పటికీ ఆచరణలో ఆ నిబంధనకు రెండు రాష్ట్రాలు గండి కొడుతూ అధిక నీటిని వాడుకుంటున్నాయి.దీంతో వానాకాలం పంటల సాగుకు నీటి విడుదల చేయలేని పరిస్థితి ఉండగా రైతాంగం వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సిన అనివార్య పరిస్థితి కొనసాగుతుంది.
వర్షాలు మరింత ఆలస్యం అయితే సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం ఇంకాస్త కనిష్టానికి పడిపోయే ప్రమాదం లేకపోలేదు…!!