పూల రవీందర్ కే మా బహుజన టీచర్స్ జేఏసీ మద్దతు

నల్లగొండ జిల్లా:నల్లగొండ, వరంగల్,ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ బిడ్డ,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కు నల్లగొండ జిల్లా బహుజన టీచర్స్ జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో జేఏసీ నేతలు సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేశారు.

 Pula Ravinder Is Supported By Our Bahujan Teachers Jac , Bahujan Teachers Jac ,-TeluguStop.com

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న బహుజన టీచర్లు అందరూ పూల రవీందర్ కు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్ వీరరాఘవులు,కొంపెల్లి భిక్షపతి,వంగూరు నారాయణ యాదవ్,కొన్నె శంకర్ గౌడ్, సిరందాసు రామదాస్,ఎండి అలీమ్,పెండెం శ్రీనివాస్,మేడే రామకృష్ణ,శ్యామల,చంద్రశేఖర్,ఐటిపాముల యాదగిరి, చిలకరాజ్ శ్రీనివాస్,బోయిన రమేష్,బి.

వెంకటేశం,తండు భానుప్రకాష్ గౌడ్,మామిడి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube