రైతు సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా...!

నల్లగొండ జిల్లా:రైతాంగం సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని,యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించి, కలెక్టర్ కు వినతిపత్రం అందించారు.ధర్నాలో పాల్గొన్న వివిధ పక్షాల నాయకులు,రైతులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.

 Mahadharna Under The Aegis Of Akhilapaksha On Farmers Issues ,mahadharna ,purch-TeluguStop.com

ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు రైతులు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని, కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం నిలువలు నీటి పాలవుతూ నష్టపోతుంటే,ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా వారిని మరింత ఇబ్బందులు పాలు చేస్తుందని విమర్శించారు.గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా పనులు గడప దాటడం లేదని ఆరోపించారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నేతలు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube