బ్రేక్‌ఫాస్ట్. రోజులో మొదట తీసుకునే ఆహారమే కాదు.ఆరోగ్యానికి అతి ముఖ్యమైన ఆహారం కూడా.రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, వివిధ రకాల అనారోగ్య సమస్యలు దరి దాపుల్లోకి రాకూడదన్నా బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా చేయాలి.
అయితే బ్రేక్ ఫాస్ట్ సమయంలో తెలిసో, తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు.ఆ చిన్న తప్పులే మనకు ముప్పులు తెచ్చిపెడుతుంటాయి.మరి ఇంకెందుకు ఆలస్యం బ్రేక్ ఫాస్ట్‌లో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏంటో తెలుసుకుందాం పదండీ.
బిజీ లైఫ్‌స్టైల్ లేదా ఇతరితర కారణాల వల్ల వేగంగా బ్రేక్ ఫాస్ట్‌ను లాగించేస్తుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే ఇకపై ఆ తప్పును అస్సలు చేయకండి.బ్రేక్ ఫాస్ట్‌ను సరిగ్గా నమలకుండా త్వరత్వరగా తినేస్తే.ఊబకాయం బారిన పడే రిస్క్ పెరుగుతుంది.అదే సమయంలో జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి.
బ్రేక్ ఫాస్ట్‌లో ఏది పడితే అది తినేసే అలవాటు చాలా మందికి ఉంటుంది.కానీ, ఆరోగ్యంగా మరియు ఫీట్‌గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.
అయితే ప్రోటీన్ అవసరం కదా అని కొందరు ప్రోటీన్‌ను మాత్రమే తీసుకుంటారు.కార్బోహైడ్రేట్లను కంప్లీట్‌గా ఎవైడ్ చేస్తుంటారు.

నిజానికి కార్బోహైడ్రేట్లను పూర్తిగా నివారించడం మరొక పెద్ద తప్పు.మీరు వాటిని పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు.ప్రోటీన్ తో పాటు తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లను బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఇక కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ను చాలా సింపుల్‌గా ముగించేస్తుంటారు.ఈ తప్పు మీరు చేస్తున్నారా.? అయితే ఇక నుంచీ అలా చేయవద్దు.తక్కువ మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటే మళ్లీ కొద్ది సేపటికే ఆకలి వేసి చిరు తిండ్లపై మనసు మల్లుతుంది.సో.కడుపు నిండా బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.