ముఖ చర్మం క్లియర్ గా మరియు గ్లోయింగ్ గా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.కానీ మొటిమలు, మచ్చలు ఆ కోరికపై నీళ్ళు జల్లుతుంటాయి.
ఈ క్రమంలోనే మొటిమలను మరియు మచ్చలను నివారించుకోవడం కోసం ఖరీదైన క్రీములను వాడుతుంటారు.అలాగే చర్మం పై మరెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే మందులు వాడతారు.ఏవేవో ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇంట్లోనే చాలా సులభంగా ఇప్పుడు చెప్పబోయే ఫేస్ వాష్ పౌడర్ తో మచ్చలు, మొటిమలను నివారించుకుని క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను పొందవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ వాష్ పౌడర్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల శెనగపిండిని వేసుకోవాలి.అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుంటే హోం మేడ్ ఫేస్ వాష్ పౌడర్ సిద్ధం అయినట్లే.
ఈ పౌడర్‌ను ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఈ ఫేస్ వాష్ పౌడర్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ వాష్ పౌడర్ లో రోజ్ వాటర్ లేదా వాటర్ లేదా రైస్ వాటర్ ను మిక్స్ చేయాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా రబ్ చేసుకుంటూ చల్లటి నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ ఫేస్ వాష్ పౌడర్‌ను రోజుకు ఒకసారి వాడితే కనుక మొటిమలు, మచ్చలు మృతకణాలు పోయి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.పైగా ఈ ఫేస్ వాష్ పౌడర్ ను వాడటం వల్ల చర్మ ఛాయ కూడా మెరుగుపడుతుంది.







