నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మదేవర నరేష్,కర్నాటి సురేష్ అనే ఇద్దరు మిత్రులు సమాజానికి సేవ చేయాలని ఐదు సంవత్సరాల క్రితం 10 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 280 మంది సభ్యులను యాడ్ చేసి, ఒక్కొక్కరు ప్రతి నెల రూ.200 జమ చేస్తూ వచ్చిన డబ్బులతో ప్రతినెల కష్టాల్లో,
ఆపదలో ఉన్న వారందరికీ ఎంత దూరమైనా వెళ్లి వారికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు.యువత సోషల్ మీడియాలో విపరీత ధోరణుల్లో వెళుతున్న నేటి సమాజంలో వినూత్న రీతిలో ఆలోచించి, మిగతా వారిని కూడా ఒప్పించి కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడం పట్ల పలువురు వాట్సాప్ గ్రూపు సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు.