నల్లగొండ జిల్లా:పాలనలో తనదైన శైలిలో ముందుకు వెళుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్ని వర్గాల నుండి శభాష్అ నిపించుకుంటున్నారు.ఎమ్మేల్యేగాఎన్నికైన దగ్గర నుండి నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై ఫోకస్ చేసి, వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
అందులో భాగంగా సోమవారం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం,మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా సందర్శించి మున్సిపల్ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.మున్సిపల్ కమిషనర్, ఉద్యోగులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో రేపటి నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టీ ప్రతిఒక్కరి అటెండెన్స్ క్లియర్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ ఉద్యోగులు అందరూ ఒక డ్రస్ కోడ్ మెయింటైన్ చేస్తూ ఆఫీసుకి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని,రాబోయే ఆగస్టు15,78వ,స్వాతంత్ర్య దినోత్సవం నాటికి పట్టణంలో పరిశుభ్రతతో పాటు మున్సిపల్ ఆఫీసులో కూడా మార్పులను ప్రజలు చూడాలంటే బాధ్యతగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు.
సమయపాలన లేకపోయినా,ప్రజల సమస్యల పట్ల సక్రమంగా స్పందించకపోయినా తక్షణమే కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఇక్కడి నుంచి బదిలీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.అనంతరం మార్కెట్ యార్డును సందర్శించి ఉద్యోగులు ఎవ్వరూ లేకపోవడంతో మార్కెట్ సెక్రటరీకి ఫోన్ చేసి సిరియస్ గా హెచ్చరించారు.
మార్కెట్ యార్డులో పనిచేసే ఉద్యోగుల లిస్ట్,వారి రిజిస్టర్, పూర్తి వివరాలు వెంటనే తీసుకొని క్యాంప్ ఆఫీస్ కు రావాలని ఆదేశించారు.మార్కెట్ యార్డులో ఎవ్వరూ లేకుండా ఏం చేస్తున్నారని అక్కడి సిబ్బందిపై సిరియస్ అయ్యారు
.