నల్లగొండ జిల్లా: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాశిలో అక్టోబర్ 6 నుంచి 10వ తేది వరకు నిర్వహించే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన నడ్డి జతిన్ యాదవ్ ఎంపికయ్యారు.ఈ నెల 14 న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏకశీల పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి సీబీఎస్ఈ క్లస్టర్ 7 అథ్లెటిక్ 5 వేల (5 కి.
మీ) మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించాడు.
ఆ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
జతిన్ యాదవ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల తల్లిదండ్రులు నడ్డి బాలరాజు యాదవ్, అంజలి,కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.