జిల్లా రాజకీయాల్లో వెధవలు కోమటిరెడ్డి బ్రదర్స్:మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా:జిల్లా రాజకీయాల్లో వెధవలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రాజ్ గోపాల్ రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు.గురువారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి,ఫైటర్ ను,ప్రజల కోసం ఎన్నిసార్లు అయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుణ్ణి,నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదన్నారు.

 Jagdish Reddy, Former Minister Of Komatireddy Brothers, Widowed In District Poli-TeluguStop.com

కోమటిరెడ్డి సోదరులకు నడమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదని,వీరికి జిల్లాలో బ్రోకర్లని పేరుందన్నారు.నల్లగొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి,సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి,అప్పటి సీఎం వైఎస్సార్ వద్ద ముడుపులు తీసుకున్న వెధవలని ఆరోపించారు.

వైఎస్సార్ పెట్టిన భిక్షతో బ్రతికోనోళ్లని,వీళ్ళు కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని,నోరు అదుపులో పెట్టుకోకపోతే లాగు విప్పి కొడతాం జాగ్రత్త బిడ్డా అంటూ ఫైర్ అయ్యారు.అప్పుడు వైఎస్సార్,ఇప్పుడు రేవంత్ బూడ్లు తుడుస్తున్నారని,రేవంత్ సంక నాకుతూ పబ్బం గడుపుతున్నారని,కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ధ్వజమెత్తారు.

వీరు ఆగర్భ శ్రీమంతుల్లాగా బిల్డప్ ఇస్తున్నారని,నా చరిత్ర ఏంటో,మీ చరిత్ర ఏంటో చర్చ పెడదామా? అంటూ సవాల్ విసిరారు.కోమటిరెడ్డి సోదరుల బలుపు అణగగొడతామని, జిల్లాకు పట్టిన శని అన్నదమ్ములని,సంస్కారం లేని వెధవలని,బిడ్డ నోరు అదుపులో పెట్టుకోండి లేదంటే లిల్లిపూట్ గాళ్ళ బండారం మొత్తం ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు.

రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషేనని,బీజేపీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని, అనవసరంగా కేసీఆర్ జోలికొస్తే తన్ని తరిమేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube