నల్గొండ జిల్లా: గుర్రంపోడు మండలం కొప్పోల్ నుండి నడికూడ వెళ్ళే రోడ్డు కంకరతేలి,పెద్ద పెద్ద గుంతలు పడి నరకప్రాయంగా తయారయ్యిందని వాహనదారులు,ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడని, వర్షం పడితే రోడ్డుపై గుంతల్లో నీళ్ళు నిలిచి చెరువును తలపిస్తూ పడవ ప్రయాణమే మేలు అన్నట్టుగా ఉందని వాపోతున్నారు.
గత ప్రభుత్వం పదేళ్లుగా ఈ రోడ్డుకి కనీస మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా ధ్వంసమై ప్రమాదకరంగా ఉందని,ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుందని, పాదచారులు సైతం నడవలేని స్థితిలో ఉందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు దృష్టి సారించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని, ఇరువైపులా పెరిగిన కంపచెట్లు తొలగించి, గుంతలను పూడ్చి వాహనదారులకు,ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.