నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం మొలకపట్నం గ్రామంలో మట్టి మాఫీయా అగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని,ఊర చెరువు మట్టిని తరలించే ప్రక్రియలో భాగంగా సమీపంలోని స్మశాన వాటికను కూడా వదలకుండా పూర్తిగా ధ్వంసం చేశారని వేములపల్లి మండల సిపిఎం కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి ఆరోపించారు.స్థానికులతో కలిసి శ్మశాన వాటికను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి దందానే పనిగా పెట్టుకున్న కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ అనుమతి లేకుండా టిప్పర్లు,ట్రాక్టర్లతో చెరువు మట్టిని తరలిస్తూ స్మశాన వాటికను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంత జరుగుతున్నా ఐబి, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని,ప్రశ్నించిన వారిని అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్మశాన వాటికను ధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు పాదురి కిరణ్ రెడ్డి,సిపిఎం గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మగాని ఎల్లయ్య,సోమయ్య,రెమడాల కరుణాకర్,భారీ సైదులు, కందిమల్ల పాపిరెడ్డి,కప్పి అంజయ్య,మేరెడ్డి పృథ్విరెడ్డి, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.