సన్ ఫ్లవర్ సీడ్స్ ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచుతాయి..ఎలా వాడాలంటే?

సన్ ఫ్లవర్ సీడ్స్.ఆరోగ్యానికి మేలు చేసే, అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందించే అద్భుత‌మైన విత్తనాలు ఇవి.

 Wonderful Skin Care Benefits With Sunflower Seeds!,skin Care, Sunflower Seeds, S-TeluguStop.com

రెగ్యుల‌ర్ డైట్‌లో స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ ఉంటే.ఎముక‌లు బ‌లంగా మార‌తాయి.

క్యాన్స‌ర్ రిస్క్ త‌గ్గుతుంది.ఒత్తిడి మాయం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.

బ్రెయిన్ షార్ప్ అవుతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్‌తో చాలా లాభాలే ఉన్నాయి.

అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.అందాన్ని పెంచ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా గుప్పెడు స‌న్ ఫ్లవర్ సీడ్స్‌ను తీసుకుని స్లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న స‌న్ ప్ల‌వ‌ర్ సీడ్స్‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల స‌న్ ప్ల‌వ‌ర్ సీడ్స్ పొడి, అర స్పూన్ కొబ్బ‌రి పొడి, పావు స్పూన్ జాజికాయ పొడి వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

Telugu Skin, Latest, Skin Care, Skin Care Tips, Sunflower Seeds, Sunflowerseeds-

చివ‌రిగా కొబ్బ‌రి పాలు వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని.అర‌గంట పాటు వ‌దిలేయాలి.ఆపై వేళ్ల‌తో సున్నితంగా చ‌ర్మాన్ని రుద్దుకుంటూ శుభ్రంగా గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ తో ఈ విధంగా వారంలో రెండు సార్లు చేశారంటే.చ‌ర్మంపై ఏర్ప‌డ్డ మొండి మొటిమ‌లు, మ‌చ్చ‌లు చాలా త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోయి.చ‌ర్మం కాంతివంతంగా, నిగారింపుగా మారుతుంది.ముడ‌త‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

మ‌రియు స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.ఇన్ని ప్ర‌యోజాలు ఉన్నాయి కాబ‌ట్టి.

త‌ప్ప‌కుండా స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్స్ తో పైన చెప్పిన రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube