మీ గుండె జర భద్రంగా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ తినాలి మరి!

డ్రై ఫ్రూట్స్( Dryfruits ) అనేవి మనిషి శరీరానికి అవసరమైన పోషకాలను మెండుగా అందిస్తాయి.ఈ గింజలలో ఫైబర్, మంచి కొవ్వు, ప్రోటీన్లు అనేవి పుష్కలంగా ఉంటాయి.

 Health Benefits Of Eating Dry Fruits,heart Health,heart Foods,healthy Foods,dry-TeluguStop.com

హాజెల్ నట్స్, జీడిపప్పు, పెకాన్, పిస్తాపప్పులు, పైన్ నట్స్, వాల్‌నట్స్ వంటి నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.బరువు తగ్గడంలో ఇవి చాలావరకు సహాయపడతాయి.

అంతేకాదండోయ్, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి.వీటికి గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాల బారి నుంచి కాపాడే గుణం ఉంటుంది.

రోజూ వారి భోజనంలో 30 గ్రాముల గింజలను చేర్చడం వలన వీటిని నివారించవచ్చు.

Telugu Cashew, Dry Fruits, Healthy Foods, Heart Foods, Heart, Telugu, Walnuts-La

కేవలం గింజలు తినడం వల్ల ప్రయోజనం ఉండదు.కానీ సరైన పద్ధతిలో తినడం వల్ల పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు ఒమేగా 3( Omega3 ) సమృద్ధిగా ఉంటాయి.

ఇది మెదడును రక్షిస్తుంది మరియు అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధి యొక్క ఆగమనాన్ని నెమ్మదిస్తుంది.వాల్‌నట్‌( Walnuts )లను నానబెట్టిన తర్వాత తింటే ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు.

అదేవిధంగా బాదంలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి.దీన్ని పచ్చిగా లేదా కాల్చి కూడా తినవచ్చు.

వీటిలో విటమిన్ ఇ, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Telugu Cashew, Dry Fruits, Healthy Foods, Heart Foods, Heart, Telugu, Walnuts-La

బాదం( Almonds ) తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుంది.దీన్ని పచ్చిగా లేదా రాత్రంతా నానబెట్టిన తర్వాత కూడా తినవచ్చు.ఇక జీడిపప్పులో మంచి కొవ్వు, ప్రోటీన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం ఉంటాయి.జీడిపప్పు( Cashew nuts ) గుండె ఆరోగ్యాన్ని, బ్లడ్ షుగర్ నియంత్రణను, బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

దీన్ని పచ్చిగా, లేదా కూరల్లో వేయించుకొని తినవచ్చు.అదేవిధంగా వేరు శనగ అందరికీ అందుబాటులో ఉంటుంది.

ఇందులో మంచి కొవ్వు, ప్రోటీన్, పిండి పదార్థాలు ఉంటాయి.ఇవి క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి డీజెనరేటివ్ నరాల వ్యాధులతో పోరాడడంలో సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube