జవాన్ సినిమా మీకందరికి గుర్తుందా ? 2017
సాయి ధరమ్ తేజ్
హీరోగా వచ్చిన ఈ సినిమా జనాదరణ పొందడం లో విఫలం అయ్యింది.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో కూడా ఈ సినిమా పెద్ద గుర్తింపును తీసుకురాలేదు.
ఇక ఈ చిత్రానికి బి వి ఎస్ రవి దర్శకుడిగా వ్యవహరించగా, కృష్ణ అనే వ్యక్తి నిర్మించారు.అయితే ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా ఉన్నారు.
సినిమా వచ్చి ఫ్లాప్ అయినా ఇన్నేళ్లకు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇటీవల ఒక మీడియా సంస్థ తో జవాన్ సినిమా దర్శకుడు బి వి ఎస్ రవి ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయింది అనే విషయం పనుకున్నాడు.
ఈ క్రమం లో దిల్ రాజు పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం తో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.విషయం లోకి వెళ్తే సినిమా ఫస్ట్ కట్ అవ్వక ముందే దిల్ రాజు తాను చూస్తాను రష్ చూస్తాను దర్శకుడి పై ఒత్తిడి తీసుకు రావడం తో వేరే దారి లేక చూపించారట.ఇక అక్కడ మొదలైంది అసలు రచ్చ.
సినిమాను ఆయనకు నచ్చినట్టు కిచిడి చేయడం తో పాటు రకరకాల విన్యాసాలు చేసి సినిమాను చెడగొట్టారు అంటూ రవి కామెంట్స్ చేయడం తో సర్వత్రా వైరల్ గా మారింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే జవాన్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తాను సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల కాకుండా దిల్ రాజు సమర్పకులు గా మారడం వల్లనే అంటూ చురకలు అంటించారు.దేంతో సోషల్ మీడియా లో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.కెరీర్ మొత్తం మీద కేవలం రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన సదరు డైరెక్టర్ గారు రెండవ సినిమా ఫ్లాప్ ని దిల్ రాజు గారి అకౌంట్ లో వేశారు మరి అంతకంటే ముందు గోపి చాంద్ తో సినిమా ఎందుకు పోయింది అని అంటున్నారు.
ఇలా బి వి ఎస్ రవి సైతం ప్రొడ్యూసర్ గా, రచయితగా కొనసాగవుతున్నారు.బాలయ్య ఆహా లో చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి కూడా రచయిత గా ఉన్నారు.
అలాగే సెకండ్ హ్యాండ్ అనే సినిమా కూడా తీశారు.