తడిసిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయాలి:అదనపు కలెక్టర్

నల్లగొండ జిల్లా:గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావాలనినల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ( J Srinivas )అన్నారు.

 Stained Grain Millers Should Purchase: Additional Collector , Vemulapally , Grai-TeluguStop.com

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం( Vemulapally ) సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు( Grain-purchases ) కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన మిల్లులకు ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు.

మిల్లర్లు ఎటువంటి కొర్రీలు పెట్టకుండా ఎగుమతి చేసిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిఓ వెంకటేశ్వరరావు,డిఎం నాగేశ్వరరావు,మండల తహశీల్దార్ షేక్ జమీరోద్దిన్,సివిల్ సప్లై డిటి జావిద్,ఎఆర్ఐ రేణుక,సహకార సంఘం కార్యదర్శి నరేష్,సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube