నల్లగొండ జిల్లా:అంగన్వాడీ వర్కస్ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నుండి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు బయలుదేరిన అంగన్వాడీ వర్కస్ ని,సిఐటియు నాయకులను నాంపల్లి పోలీస్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు చంద్రమౌళి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు.
అక్రమ అరెస్టులను ఖండిస్తూ ప్రజా ఉద్యమాలపై అణచివేత ధోరణి తగదన్నారు.న్యాయమైన డిమాండ్లపై ధర్నా చేస్తున్న అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమం ఆపేదే లేదని తెగేసి చెప్పారు.