108 అంబులెన్స్ ను ఎత్తుకెళ్లిన దొంగ సినిమా స్టైల్లో పోలీసుల ఛేజింగ్

నల్లగొండ జిల్లా: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్ చేసింది.సినీ పక్కిలో హైవేపై భయానక వాతావరణ సృష్టించిన అంబులెన్స్ ను వెంబడిస్తూ తెలంగాణ పోలీసులు భారీ చేజ్ చేశారు.

 Police Chase In Movie Style After Thief Steals 108 Ambulance, 108 Ambulance , P-TeluguStop.com

మతిస్థిమితం లేని వ్యక్తి హయత్ నగర్ లో 108 అంబులెన్స్ చోరీ చేసి ఖమ్మం వైపు వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారిపై హైడ్రామా నెలకొంది.హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి నకిరేకల్ పోలీస్ స్టేషన్ వరకు చిక్కని అంబులెన్స్ దొంగ.

గతంలో ఇదేవిధంగా అంబులెన్స్ ను చోరీ చేసినట్లు తెలిపిన కేతేపల్లి ఎస్సై శివతేజ.చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపడానికి ప్రయత్నించిన ఎస్ఐ జాన్ రెడ్డిని ఢీ కొట్టి మరీ పారిపోయిన దొంగ.

కొర్లపహాడ్ టోల్గేట్ ను ఢీ కొట్టి పారిపోయాడు.ఎట్టకేలకు టేకుమట్ల స్టేజీ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి అంబులెన్స్ తో పారిపోతున్న దొంగను పట్టుకున్న కేతేపల్లి ఎస్ఐ శివతేజ.

కేతేపల్లి పోలీసుల అదుపులో అంబులెన్స్ దొంగ ఉండడంతో ఊపిరి పీల్చుకున్న 108 సిబ్బంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube