నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న ఉదయ సముద్రం చెరువు ఏఎంఆర్పీ ప్రాజెక్టు కాలువ ద్వారా కృష్ణా జలాలతో రిజర్వాయర్ పూర్తిగా నిండింది.కృష్ణా జలాలతో రాకతో నిండు కుండలా మారి జలకళను సంతరించుకుంది.
దీంతో చెరువు అలుగు నుండి మత్తడి దూకి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది.అలుగు మీదుగా జాలు వారుతున్న కృష్ణవేణి సోయగాలను వీక్షించేందుకు నల్గొండ పట్టణవాసులు రిజర్వాయర్ కట్ట ట్యాంక్ బండ్ మీదకు భారీగా చేరుతున్నారు.