నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.రోజువారి పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు
రోడ్డుపై ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి,తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను తన సిబ్బందితో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ల సిబ్బందితో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.