నల్లగొండ జిల్లా:గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను అభ్యర్థుల సొంత జిల్లాలోని నిర్వహించాలని పి.డి.
ఎస్.యు నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్ ( Suresh )డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో జరిగిన పి.డి.ఎస్.యు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహించే గురుకుల ఉపాధ్యాయుల ఎంపిక పరీక్షలను ఒక పరీక్ష ఒక్కో జిల్లాలో నిర్వహించడం వల్ల గురుకుల టీచర్ అభ్యర్థులు( Gurukula ) సకాలంలో చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పరీక్షలు వరుసగా ఏర్పాటు చేయడంతో,చిన్నపిల్లలు ఉన్నవారు,గర్భిణీ అభ్యర్థులు ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒకే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.
డి.ఎస్.యు( PDSU ) నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఇందూరు మధు,చందన, మనిషా,వీరేష్,నర్సింహ తదితరులు పాల్గొన్నారు.