యాదాద్రి భువనగిరి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జంపల్లి గ్రామ శివారులో శుక్రవారం అడవి దున్న సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.గురువారం అడవి దున్న చౌటుప్పల్ మండలంలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే.
దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.మనుషులపై దాడి చేసే అవకాశం ఉందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.







