యాదాద్రి జిల్లా:ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వేల్పుపల్లి,ఇబ్రహీంపూర్ గ్రామాల్లో తాటి,ఈత చెట్లను ధ్వంసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ సంఘము అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు,తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో భూములు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసుకోవడంలో తప్పులేదని, కానీ,అట్టి భూములలో ఉన్న గౌడ జాతీ జీవనాధారమైన తాటి,ఈత వనాలను పూర్తిగా ధ్వసం చేస్తూ గౌడ కుటుంబాల పొట్టకొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత ఎక్సయిజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి బాద్యులైన రీయల్ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో గౌడ కులస్థులతో కలిసి పేద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.