నల్గొండ జిల్లా:పెద్దవూర మండలం పాల్తితండాకు చెందిన పాల్తి శంకర్ నాయక్, సరోజ దంపతుల కూతురు పాల్తి స్రవంతి మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 460/470 మార్కులతో ఎంపీసీ విభాగంలో స్టేట్ ర్యాంక్ సాధించింది.
మారుమూల తండాలో పుట్టి న్యూ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హైదరాబాదులో చదువుతూ పట్టుదలతో స్టేట్ ర్యాంక్ సాధించిన చిన్నారికి కుటుంబ సభ్యులు, బంధువులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు.







