నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన కంభం రవి(30) అక్కడికక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనంపై వెళుతున్న మృతుడు డివైడర్ ను ఢీ కొట్టి కింద పడగా వేగంగా వస్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో
ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







