సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గట్టుకు వెళ్ళే దారిలో జె.ఎస్.
డి టౌన్ షిప్ పేరుతో సీలింగ్ భూమిలో అక్రమంగా వెంచర్ వేసి అమ్మకాలకు సిద్ధమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ అధికారులకు పిర్యాదు చేసినట్లు ముండ్ల నగేష్ చెప్పారు.వెంచర్ ఏర్పాటు చేసిన భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం సీలింగ్ కింద ఉందని,ఇదే విషయంపై గతంలో కలెక్టర్,తహసీల్దార్ కు ఫిర్యాదుతో పాటు లోకాయుక్తలో కేసు వేయగా విచారణ జరుగుతుందని,38-ఈ రక్షిత కౌలుదారు ఆర్డీవో దగ్గర పెండింగ్ ఉన్నదన్నారు.
ఐనా కూడా సీలింగ్ భూమిని నాలాగా మార్చి ప్రభుత్వానికి చెందాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా జె.ఎస్.డి టౌన్ షిప్ పేరుతో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.ఈవిషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరామని తెలిపారు.