నూతన రేషన్‌ కార్డుల కోసం మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

నల్లగొండ జిల్లా:నూతన రేషన్ కార్డుల కోసం అర్హులలైన వారు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పించనుంది.

 Online Applications For New Ration Cards Through Me-seva, Online Applications ,n-TeluguStop.com

ఈ మేరకు మీ-సేవ డైరెక్టర్‌కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది.

కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని అందులో కోరింది.

అనర్హులు, డూప్లికేట్‌ దరఖాస్తులను నివారించడంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది.పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు తమకు సమీపంలోని మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించినట్లయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube