నల్లగొండ జిల్లా:రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపదుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మోడల్ హౌస్ నిర్మాణాన్ని చేపడుతోంది.దీని ఆధారంగానే లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా డిజైన్ రూపొందిస్తున్నారు.ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల సాయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు.అందరికీ అందుబాటులో ఉండేలా ప్రతి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దీనిని నిర్మించేలా కార్యాచరణ చేపట్టారు.ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయించనుంది.ఈ మొత్తంతో ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చనేది ప్రయోగాత్మకంగా చూపడానికే నమూనా ఇళ్లను తయారు చేస్తున్నారు.
ఇంటి నిర్మాణానికి కనీసం 60 గజాల స్థలం ఉండాలని నిబంధన విధించింది.ఇందులో స్లాబ్ ఏరియా 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.12.5 వెడల్పు,10.5పొడవుతో పడక గది నిర్మించనున్నారు.6.9 వెడల్పు,10 చదరపు అడుగుల విస్తీర్ణంతో వంట గది,9 అడుగుల పొడవు,10 అడుగుల వెడల్పుతో ముందు గది నిర్మిస్తున్నారు.
డాబా పైకి మెట్లు అనేది లబ్ధిదారుని ఇష్టం.దీంతో పాటు సాన్నాల గది,టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.8 పిల్లర్లలోనే పూర్తి చేసేలా నమూనాను రూపొందించారు.సంబంధించి మ్యాప్ బట్టి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది.స్థలాలు ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేలా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను తొలి విడతగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటి నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ ద్వారా ఇచ్చే నమూనా అందరికీ ఒకేలా ఉండేలా ప్రతి మండలంలో మోడల్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిరిగానే నిర్మాణాలను చేపడుతున్నారు.
ఇందు కోసం గృహనిర్మాణ శాఖకు జిల్లాలో ఒక పీడీ, నియోజకవర్గానికి ఒక డీఈ,ఏఈలను నియమించారు.వీరి ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిర్వహించనున్నారు.