నల్లగొండ జిల్లా: వైద్యులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇకపై రోగులకు యాంటీబయోటిక్స్ ఇవ్వడానికి గల కారణాలు,సూచనలను తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్లో రాయాలని ఆదేశించింది.
ఫార్మాసిస్ట్లు కూడా కచ్చితమైన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయోటిక్స్ విక్రయించాలని సూచించింది.చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా యాంటీబయోటిక్స్ వాడుతున్నారని,దీని వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.