విజయపురి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎస్పీ

నల్లగొండ జిల్లా:రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా 24/7 నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజయపురి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అదేశించారు.నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ విజయపురి పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించి, సిబ్బంది పని తీరు,స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి సిఐ బీసన్న,ఎస్ఐ సంపత్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు.

 Sp Who Made A Surprise Visit To Vijayapuri Police Station , Vijayapuri Police St-TeluguStop.com

రిసెప్షన్, స్టేషన్ రైటర్,లాక్ అప్, ఎస్.హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను, పరిస్థితిని,రికార్డ్స్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుండి ప్రజా సమస్యలను తీర్చాలని,ప్రజాఫిర్యాదుల్లో జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.హైవే వెంట దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రొలింగ్ నిర్వహించాలని,సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వాహుకులకు అవగాహన పెంచాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు.

నాగార్జునసాగర్ రెండు రాష్ట్రాలకు సరిహద్దులో అక్రమ గంజాయి రవాణా జరగకుండా అనునిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు.పగలు,రాత్రి 24/7 పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని,పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగున్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని,సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగజేసేలా పని చేయాలని,అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మకం కలుగుతుందన్నారు.సుదూర ప్రాంతాల ప్రజలకు మండల స్థాయిలోనే పరిష్కరించే విధంగా నాగార్జునసాగర్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.

ఫిర్యాదారులతో జిల్లా ఎస్పీ తమ సమస్యల పట్ల నేరుగా మాట్లాడి, పరిశీలించి సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.మారుమూల గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారని,దీని కొరకు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిస్కరించుటయే ధ్యేయంగా ఈ యొక్క ప్రోగాం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి వారానికి ఒకసారి మండల పోలీసు స్టేషన్లో మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని,ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, విజయపురి సిఐ బీసన్న, ఎస్ఐ సంపత్ గౌడ్,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube