సుంకిశాల ప్రాజెక్టు పాపం బీఆర్ఎస్‌ ప్రభుత్వానిదే: కాంగ్రెస్ మంత్రులు ఫైర్

నల్లగొండ జిల్లా:సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణమని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్,తుమ్మల ఆరోపించారు.గత వారం క్రితం సుంకిశాల ప్రాజెక్ట్ రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటనపై పరిశీలించేందుకు శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) సుంకిశాలలో పర్యటించి,కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు.

 Sunkishala Project Is A Sin Of Brs Government, Congress Ministers Fire, Brs, Su-TeluguStop.com

అనంతరం మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రి ఉత్తమ్ (uttam) మాట్లాడుతూ.

జరిగిన సంఘటన చిన్నదేనని, నష్టం కూడా తక్కువేనని,ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారని, ప్రజలకు,ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు.ప్రాజెక్టు పూర్తి కాలేదని,నిర్మాణంలో కూడా లేదని,నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి,రెండు నెలలు పట్టేదని ప్రస్తుతం నిర్మాణం ఆలస్యం కానుందన్నారు.

గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదని,ఎట్టిపరిస్థితుల్లోనూ మేము పూర్తి చేస్తామని, డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తమని, బీఆర్ఎస్(BRS) నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.సుంకిశాల పనులన్నీ బీఆర్ఎస్ హయంలోనే జరిగాయన్నారు.

మంత్రి తుమ్మల (Tummala) మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన ఈ ఏడాది ఉయ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు.ప్రాజెక్టు కూలిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు.

జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు.ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy )మాట్లాడుతూ.గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణానది ప్రాజెక్టుల పనులు జరగడం లేదన్నారు.

సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్‌కే (KCR, KTR)తెలియాలని, హైదరాబాద్,సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల(sunkishala) అవసరం లేదని అభిప్రాయపడ్డారు.ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,సంబంధిత అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,పోలీసు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube