రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి మైనర్ మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి 285 వాహనాలు సీజ్ చేసి, పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించి తరచు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన సుమారు 300 వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఈ చాలాన్ల కింద జరిమాన విధిస్తూ వాహనాలు విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని,దానితో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు.
రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్ చేయడం వలన ఒక వ్యక్తి మరణించాడని ఆ మైనర్ తల్లిదండ్రులపైన కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసారు.
మైనర్ డ్రైవింగ్ చేస్తూ,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణంమై ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తే 10 సంవత్సరాల కఠిన శిక్షలు పడేల చట్టాలు ఉన్నాయన్నారు.
తల్లిదండ్రులకు,వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని 18 సంవత్సరాలు నిండాని పిల్లలు వాహనాలు ఇవ్వద్దన్నారు.
పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు.
మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల, మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు, ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.