రాజన్న సిరిసిల్ల జిల్లా: క్రీడలు మనలో ఉన్న శక్తి సామర్ధ్యాలను వెలికి తిస్తాయని, క్రీడల వల్ల మానాసికొల్లాసంతో పాటుగా శారీరక దృఢత్వం కలుగుతుందని , క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రోస్సహించాలన్ని తల్లిదండ్రులుకు జిల్లా ఎస్పీ సూచించారు.శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని కొత్తచేరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో సిరిసిల్ల ,వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శశిక్షణ శిబిరాల్లో పాల్గొన్నా విద్యార్థిని , విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ .
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యమే అని,జిల్లాలో ఉన్న యువతను క్రీడల వైపు ప్రోత్సాహించేందుకు,చేడు మార్గాల వైపు దారిమల్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి యోగ, కరేటే, వాలీబాల్, కబడ్డీ,మార్షల్ ఆర్ట్స్,అర్చరీ మొదలగు క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు .క్రీడల వలన విద్యార్థులలో శారీరక దృఢత్వంతో పాటుగా ఒత్తిడి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు.నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు.
విద్యార్థిని,విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను చేరుకోవడానికి నిత్యం కష్టపడాలని, కష్టపడే తత్వమే విజయాల దరికి చేరుస్తుందన్నారు.ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో,ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.అనంతరం వేసవి శిక్షణ లో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను సన్మానించిన జిల్లా ఎస్పీ.ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు రఘుపతి, వీరప్రతాప్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.