రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ నూతన గృహప్రవేశం చేయగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.మర్రి శ్రీనివాస్, తన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దీవించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు దొమ్మడి నర్సయ్య, సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, పందిర్ల సుధాకర్, కేతిరెడ్డి జగన్ రెడ్డి, మేడిపల్లి దేవానందం, షేకు గౌస్ బాయ్, చీటి లక్ష్మణరావు, వర్స కృష్ణాహరి, తదితరులు పాల్గొన్నారు.







