శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం( Venugopalaswamy Templ ) నిర్మాణానికి విరాళాలు సేకరించాలనీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ తీర్మానం చేసింది.

ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్ అధ్యక్షతన ఆలయంలో కమిటీ సభ్యులు సమావేశమై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారి ద్వారా ఆలయ నిర్మాణానికి విరాళాలు ఆలయ కమిటీ.

సభ్యులందరు కలిసి సేకరించాలని తీర్మానించడం జరిగింది.శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఎవరైనా పుట్టిన రోజు పెళ్లి రోజులు సందర్భంగా ఆశీర్వచనం చేసే స్వామివారి చిత్రపటం అందించి పురోహితులు ఆశీర్వచనం చేయాలని తద్వారా విధానాలు సేకరించాలని నిర్ణయించారు.

దుబాయ్ , మస్కట్ , సౌదీ అరేబియా గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వారి ద్వారా విరాళా లు సేకరించాలి వివిధ వ్యాపార సముదాయాల యజమానులు ద్వారా విరాళాలు సేకరించాలని తీర్మానం చేశారు.శ్రీ వేణుగోపాల్ స్వామి రథోత్సవం సందర్భంగా లడ్డు కొబ్బరికాయ వేలం పాటలలో పాల్గొనే వారు అదే రోజు డబ్బులు చెల్లించె విధంగా కమిటసహాకరించాలనీ కోరారు.

ఆలయ నిర్మాణానికి పదివేల రూపాయలు ఇచ్చిన వారి పేర్లు శిలాఫలకంపై రాయించి గోడపై అతికించాలనీ కమిటీ నిర్ణయించింది.ఈ సమావేశంలో ఆలయ పూజారి నవీన్ చారి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, బండారి బాల్ రెడ్డి, మెగి నర్సయ్య, సంతోష్ , ఓగ్గు బాలరాజ్ యాదవ్ ,వంగ గిరిధర్ రెడ్డి పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , నల్లనాగుల రామా చారి, కిష్టయ్య , చందనం శంకర్ , బ్రహ్మచారి, తోట బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఊపందుకున్న బిజెపి ఇంటింటి ప్రచారం

Latest Rajanna Sircilla News