మున్సిపల్ విధులను ప్రతి అధికారి పకడ్బందీగా నిర్వహించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లా : మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క అధికారి తన విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సిరిసిల్ల మున్సిపాల్టీల పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 Municipal Duties Should Be Carried Out By Every Officer Armed Collector Sandeep-TeluguStop.com

మున్సిపాలిటీ లలో పని చేస్తున్న సిబ్బంది, అధికారుల వివరాలు, వారు నిర్వహిస్తున్న విధులు, సానిటరీ డోర్ కలెక్షన్ , ఎన్ని చెత్త బుట్టలు పంపిణీ చేసారు, వాహనాలు వివరాలు, వర్కింగ్ నాన్ వర్కింగ్, ట్రెడ్ లైసెన్సు లు, వాటి ఆదాయ వివరాలు బిల్డింగ్ పెర్మ్మిషన్స్, వి.ఎల్.టి, ఆస్తి పన్ను వసూళ్లు, స్లీపింగ్ యంత్రాలు, వాటర్ ట్యాంక్ ,డోజేర్స్, బ్లేడ్స్,వర్మి కాంపొస్ట్, ఎస్.టి.పి ప్లాంట్ పని తీరు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,మున్సిపాలిటీ సిబ్బంది కి అనుమతి లేనిదే సెలవులు మంజూరు చేయరాదని అన్నారు.

సిరిసిల్ల పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ప్రతి రోజూ ఉదయం పారిశుధ్య సిబ్బంది హాజరు అటెండెన్స్ పక్కాగా నమోదు జరగాలని, ప్రతి రోజూ చెత్త సేకరణ పకడ్బందీగా చేయాలని అన్నారు.

మున్సిపల్ వాహనాలకు ప్రభుత్వ పెట్రోల్ బంక్ లో మాత్రమే డీజిల్ వాడాలని కలెక్టర్ తెలిపారు.

మున్సిపల్ వాహానాలకు జి.పి.ఎస్.ట్రాకర్ ఏర్పాటు చేయాలని, ప్రతి రోజు ఆ వాహనాల మూమెంట్ ను మానిటరింగ్ చేయాలని అన్నారు.

మున్సిపాలిటీ లలో జారీ చేసిన ట్రెడ్ లైసెన్స్, వాటి రిన్యువల్స్, వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజు పునః పరిశీలించాలని, పూర్తి స్థాయిలో ప్రతి వ్యాపారి నుంచి ట్రెడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని, కలెక్టర్ ఆదేశించారు.పట్టణాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు 100% ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని అన్నారు.

నూతన భవన నిర్మాణాల అనుమతులు, నూతన లేఔట్ అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయాలని అన్నారు.నూతన లేఔట్ లలో ఓపెన్ ప్లెస్, ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అన్నారు.
పట్టణాలలో మొక్కల పెంపకం, త్రాగు నీటి సరఫరా సంబంధిత వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.సిరిసిల్ల బైపాస్ రోడ్డు వద్ద బ్లేడ్ యంత్రాలతో మిడియన్, రొడ్డు పక్కన ఉండే పిచ్చి మొక్కల తొలగిస్తూ శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు.

మున్సిపాలిటీ లలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి గతులు తెలుసుకున్న కలెక్టర్ ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.

పట్టణాలలో అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని నిర్మాణాలకు ఆస్కారం ఇవ్వవద్దని, వాటర్ బాడిస్ ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో సిరిసిల్ల మునిసిపల్ కమీషనర్ లావణ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube